Friday, January 22, 2010

సంగీతానికి భాష ఉండదా?

లేదనే అనిపిస్తుంది. లేకపోతే పాచ్చాత్య పోకడలతో సంగీతాన్ని కంపు కంపు చేస్తున్నారు అనుకునే మనవాళ్ళు (కొందరు) అవే పాటల్లో తెలుగు పదాలు ఇరికిస్తే "వః ఉస్తాద్" అంటున్నారు. అవునండి పదాలను ఇరికించడమే. అన్నికాకున్నా కొన్ని copied పాటల్లో మీరు గమనించే ఉంటారు దీన్ని. పత్తి బస్తాల్లో పత్తిని ఇరికించినట్టు, జిప్ ఫైల్ లో files ని ఇరికించినట్టు రాస్తారు పాటలను. పాట కుదరాలి కదా మరి.

అప్పట్లో మనవాళ్ళు ముందు పాటని రాయించి తరువాత దానికి తగ్గట్టు ట్యూన్ చేసే వారట. ఇప్పుడు అది కాస్త తారుమారు ఐంది (ముందుగానే ఎవరిదో కష్టార్జితమైన tune ready గా ఉంటది కదా మరి). ఏది ఏమైనా ఇలా ఫుక్కట్ కు దొంగలించిన పాటలతో మనం కొన్ని ఆణిముత్యాలను వింటున్నాం. లేకపోతే ఎప్పుడో 1983 లోనో లేక 1990 లో వచ్చిన పాటని విని మణిశర్మ(ప్రేరేపించబడి) అతడు సినిమా టైటిల్ సాంగ్ tune చేయడం ఏంటి, ఏదో వీడియో గేమ్ కి శృతి చేసిన background music ని విని కీరవాణి చత్రపతి సినిమాకు (అగ్ని స్కలన పాటకు) దాన్ని వాడుకోవడం ఏంటి. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఒక్కసారి youtube లో మునిగితే copied songs అనే మొసళ్ళు పీక్క తింటాయ్. దాంట్లో మునిగి మనం తేలము కావచ్చు. మన music directors పైన విసుగు వస్తది( చాల మంది చేస్తున్నారు అనుకోండి కేవలం మనవాళ్ళే అని కాదు). వింత ఏంటి అంటే రెహమాన్ కు ఆస్కార్ తెచ్చిన జయ హొ కూడా కాపీ అని పెట్టారు youtube లో. కాకపోతే అది కేవలం ఓ ౩౦ seconds మ్యాచ్ ఐంది( ఐనట్టు అనిపించక అనిపించింది). అది కూడా తీక్షణంగా వింటే కానీ అనిపించదు.

ఏది ఎమైన కష్టం ఒకడిది ఫలితం ఒకడిది. దొరికే వరకు అందరూ దొరలే. కానీ దొరికితే..ఎం కాదండి...పైసా మే పరమాత్మ. krazy 4 movie కోసం జరిగిన తంతు మీకు గుర్తుండే ఉంటుంది. రాజేష్ రోషన్ 2 కోట్లు కట్టాల్సి వచ్చింది సోనీ ఎరిక్సన్ add కి సంగీతం సమకూర్చిన వాడికి.

ఇప్పుడు ఇదంతా రాయాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఏదో అలా రాయాలి అనిపించింది అంతే. నేను ఇక్కడ రాసింది అందరికి అన్ని వేళల
వర్తించదు అని మీకు తెలుసు నాకు తెలుసు.

Monday, January 18, 2010

సంక్రాంతి తిరుగు ప్రయాణం..రొచ్చు రొచ్చు.

అబ్బో తిరుగు ప్రయాణమా.... రొచ్చు రొచ్చు.
సమయం 4.30 pm. టైం లో ట్రైన్ ఉంది రా.. కృష్ణ ఉంది కదా.. 5 కి ట్రైన్. అది ఆపుకుంటూ తీసుకెళ్ళిన 8.30 కి చేరుకోవచ్చు. బస్సు లో వేల్లోచు కదా. బస్సు ఇక్కడ నుండే మొదలు అవుద్ది. seat gurantee. హైదరాబాద్ సగానికిఎక్కువ కాలినంట. అందరూ తిరిగి వస్తూ ఉంటారూ. ట్రైన్ pack అయ్యి ఉంటది. దాంట్లో వెళ్తే నువ్వు అప్పడం అవ్తావ్. అదిమాత్రం రాసి ఇస్తాను. అహా...ఎందుకు వింటాం మనం(బస్సు అయితే mgbs నుండి మల్లి 2 బస్సు లు మారాలి). తీటనో..దూల నో.. ట్రైన్ కే అనుకున్నా.. బయల్దేరాను.

ట్రైన్ టికెట్ లు తీసుకునే దగ్గర నుండి శురు డ్రామా..
అన్నా ఒక్క టికెట్ తీసి ఇయ్యవా ప్లాట్ఫారం పైన ట్రైన్ ఉంది అని ఒకడు..ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరం బేక్ గాల్లమా
అని ఒకడు.. మేము కూడా దానికే వెళ్ళాలి అని ఒకడు.. వెనకోచ్చి నిలబడు అని ఒకడు.. సరిపోయింది sentence complete ఐంది అనుకున్నా.

ఇంతలోనే announcement krishna 40 mins ఆలస్యంగా నడుస్తుంది అని.. ఎం చేయాలి.. సెల్.. బాలన్స్ కతం. ఇప్పుడేం చేయాలి. సండే బుక్. కొరికి వోదిలిపెట్టా. ఇంతలోనే ట్రైన్ వస్తుంది. రైల్ని చుస్తే నాకు గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయ్. రుమాలు( నేను ఇంత సేపు అనుకున్నా బ్రహ్మాస్త్రం) వ్యర్దం. ట్రైన్ నుండి దిగే వారిని చూస్తే.. గెలిచా.. అని అనుకునే alexandar వీరి లాగానే ఉంటాడు కావచ్చు అనుకున్నా.

ట్రైన్ ఎక్కుతుంటే.. ముందుగానే ట్రైన్ లో ఉన్నఒకతను.. ముందలంగా ఉన్నవాళ్లు కొద్దిగా అటు ఇటు జరగండి అన్నాడు.. అదేంటి అటు ఇటు జరగడం, మల్లి అక్కడికే కదా వచ్చేది అనుకున్నా. ఏంటి ఎక్కలేక పోతున్న నేను. ఒహొ అందరం ఒకేసారి లోపలి రావాలి అని ప్రయత్నిచడం ద్వారా అల అవ్తుంది కాబోలు అని అనుకోని ఏదోలాఎక్కాను. ఎందరి కాళ్ళు తోక్కుతునో.. ఎందరితో మన కాళ్ళు తొక్కించుకుంటూనొ.. కొద్దిగా లోపలికి వెళ్లి నిలబడ్డా.

ట్రైన్ ఎంత కిక్కిరిసి పోయింది అంటే.. ఆడ మగ అనే తారతమ్యం లేనే లేదు. అక్కడ నిలబడి ఉంటే చాలు. ఎవరు ఎవరిని తగులుతున్నారు అని అక్కడ పట్టించుకునేంత స్పర్శ కానీ తిరిగి అడిగే ఓపిక కానీ ఎవరికీ లేదు.

ట్రైన్ లో అమ్మయిలను పటాయించె పంచాయితి శురు. కళ్ళతోనే అమ్మాయిలని పీక్క తింటారు అనేంత కామం ఉంది కళ్ళలో. మేమెందుకు తక్కువతిన్నాం వాళ్ళు చుస్తే మేము కూడా చూడగలం అని సవాలు చేసే అమ్మైలూ లేకపోలేరు. ఏదో మిస్ అవ్తుందే ఇక్కడ... హా సమోసాలు, పల్లీలు, చిర్తిండ్లు.. రైట్.. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఆయుదల తో యుద్ధంలోకి దిగారు. అక్కడ ఒంటికాలు ఫై నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంత జనంలో కూడా అందరిని తోసేస్తూ వాళ్ళ దుకాణం మొదలు పెట్టారు. ఇంతలోనే తిట్లు, చివాట్లు మొదలు. ఎవరో ఎవరి కాలో తొక్కారు. ఇంకొకరు లోనికి జరుగు అనుకుంటూ గొడవ. ప్రతి స్టేషన్ కి కావాలనో, సిగ్నల్ లేకనో, వేరే ట్రైన్స్ ని పంపివాలనో 10 mins ఆపుతూ వెళ్తున్నాడు. కొన్ని చోట్ల 20, ౩౦ కూడా ఐంది.
నేను ఇంకో క్యారెక్టర్ మిస్ ఐంది కదా ట్రైన్ ట్రిప్ లో అనుకుంటున్నా.. అప్పుడు వినిపించాయ్ చప్పట్లు. "ఏందీ బావ ఇలా చేస్తున్నారు మీరు. ఒక్కరు కూడా ఇవ్వట్లేదు ఏందీ బావ మనీ." వాళ్ళను చూస్తూనే కొందరు toilet లోకి పరారు. కొందరు బయపడి 5 rs ఇస్తే "ఏందీ రాజా బిచ్చం వేస్తున్నావ్. తియ్ 10 లేదా 20. కొందరిని xxx లేదా" అని అంటూ రుబాబ్.
నా ట్రైన్ జర్నీ అనే వంటలో ఒక్కటే మిస్ ఐంది అది ఏంటంటే tc వచ్చి టికెట్స్ చెక్ చేయడం. అన్నీ జరిగాయి.. ఎట్టకేలకు 10.30 కు sec'bad చేరుకున్నా. 8.30 కు రావాల్సిన ట్రైన్ 10.30 కి sec'bad కు వచ్చింది. 5.40 నుండి 10.30వరకు నిలబడాల్సి వచ్చింది. చెప్పింది విననందుకు నా దూల తీరింది. బ్రతికి బయట పడ్డా.. ఒళ్ళు హూనం ఐంది.
నేను రాసిన పదాలు ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి.

Wednesday, January 13, 2010

కొత్తనో, చెత్తనో, ఇలా కూడా గ్రీటింగ్స్ చెప్పోచ్చా?

బోగి.. అయినా కూడా సుఖం లేదు. పండుగ రోజు కూడా ఆఫీసు కి వెళ్ళాల్సి వచ్చింది..
బయల్దేరుతుంటే ఫ్రెండ్స్ దగ్గరి నుండి sms లు. వింత ఏంటి అంటే గత మూడు సంవత్సరములుగా ఒక sms ప్రతి సంక్రాంతి కి వస్తుంది. అందులో matter కించిత్ కూడా కదలలేదు. 50 sms లలో కచ్చితంగా 25 sms లు ఇదే ఉంటుంది. ఆ sms ఏంటి అంటే
"
భోగి తో భోగ భాగ్యములును
సంక్రాంతి తో సిరిసంపదలను
కనుమ తో కళల కోరికలను తీర్చుకోవాలని ఆశిస్తూ- హ్యాపీ పొంగల్."

వింతగా మనం ఎదైనా వ్రాయచ్చా అని ఆలోచించా. అది కాస్త కొత్తగానో లేక కాస్త వింతగానో లేక కాస్త చెత్తగానో ఐంది.
మొత్తానికి చివరికి ఆ sms ఇలా ఐంది...

"
remix song లో ఉండేంత ఊపు తో,
బాలకృష్ణ చూపుడు వేలుతో ట్రైన్ ని వెనక్కి పంపినంత కామెడీ గా,
సొల్లు రాసి exams pass అయితే ఉండేంత సంతోషంగా,
ఎన్ని vehicles వచ్చినా ఎప్పుడు నిండుగా ఉండే RTC bus లాగా నిత్య సంతోషాల తో
సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుంటూ..... Kumar"

అని రాసి పంపుదాం అనుకున్న కానీ చివరికి ఫై sms బాగుండదు అనిపించింది, దానికి ఇంకో line add చేయాల్సివచ్చింది(సినిమా కి ట్యాగ్ లైన్ లా). "పైన నేను రాసినంత చెత్తగా కాకున్నా కొత్తగా, వింతగా,సంతోషంగా జరుపుకొండి" అని రాసి పంపా.

ఏమో లే కొత్త ఒక వింత పాఒక రోత.. అన్నారు
old is gold అని కూడా అన్నారు.. కావాల్సినప్పుడు ఎదైనా వాడుకోవచ్చు అన్నమాట.

Friday, January 8, 2010

తలా తోక లేని చదువులు

దీంట్లో చెప్పేది కొత్తగా ఎం లేదు. మనం చదివిన చదువుకు చేసే పనికి ఎంత మాత్రం సరిపోద్ది అని మీరు అనుకుంటున్నారు. -Iditios movie చుసిన వారందరికి అర్థం అయ్యే ఉంటది ఇప్పటికి లేక మీరు ముందుగానే దీని గురించి ఆలోచించి ఉంటారు. చదివింది electronics mechanics చేస్తుంది software job అని ఇప్పటికే అనుకోని ఉంటారు. కానీ ఎవరు మాత్రం వద్దు అనుకుంటారు అంత జీతాన్ని అలాంటి జీవితాన్ని. నిజమే నచ్చింది చేయాలి.
అదొక్కటేనా చదివిన చదువు ఎంత వరకు ఉపయోగపడుతుంది.
చదివింది java చేసేది soaనో లేక soap లేక ఇంకోటి. నిజమే అవి పునాదులు(కాలేజీ వి ) ఇవి బిల్డింగ్ లు(ఆఫీసు వి ). పునాదులు ఎప్పుడో జమానాలో వేసినవి(syllabus మారదు ). ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీస్ curriculam లో add కావడానికి ఇంకో 10-yrs అప్పటికి ఇంకోటి వస్తది. కంపెనీ ఇంటర్వ్యూ కోసం మల్లి బయట ట్రైనింగ్ లకు వెళ్ళాలి.
కట కట
ఇంకా కారణాలు ఉన్నాయి. syllabus మారినా చెప్పే వారు కరువు. చెప్పే వారు లేరని మనం చదవకుండా ఉండం కద.
మార్చండి system ని.
వీడు సలహాలు ఇవ్వడమేనా అని అనుకోకండి మా వంతు సహాయంగా మేము .యు. convenor తో దీని గురించి మాట్లాడాము. తల చేయి వేస్తె system ని మార్చడం పెద్ద కష్టం కాదు. ఉన్నవే చదవలేక పోతున్నాం కొత్తవి ఎందుకు అనుకుంటే అలా నే ఉండండి.



Wednesday, December 23, 2009

చావుకు గాలెం.......

రోజు నేను చూసిన దృశ్యం చూసిన వారు ఎవరైనా కూడా నాలానే అనుకుంటారు. మనిషి కావాలని చావుకు గాలెం వేస్తున్నాడు అనుకుంటారు. యమధర్మరాజు వద్దురా బాబూ నన్ను వదులురా అంటున్న వినకుండా మనిషి కావాలని ఆయనను ఆయన దున్నపోతును ఓడరేవులో ship ని లంగరు వేసి గుంజినట్టు మరీ గుంజుతున్నాడు అనుకుంటారు.

ఆసలు విషయానికి వస్తే నేను రోజు ఉదయం mmts train లో ప్రయానిస్తు ఉన్నాను. train జేమ్స్ స్ట్రీట్ లో ఆగింది. ఆగిన ట్రైన్ ఎక్కడం మంచిదని నాకు తెలుసు మీకు తెలుసు. కానీ దూల కొద్ది move ఐన ట్రైన్ని catch చేస్తాం మనం(చాలా మంది). లోకల్ ట్రైన్స్ ఎంత వేగంగా వేల్తాయో మనకు తెలుసు కానీ అలాంటి ట్రైన్ ని కూడా బస్సు లాగా వేగం పుంజుకున్నాక పట్టుకుంటాం అంటే అది మన దూలకు పరాకాష్ట. అయితే ఒక స్టూడెంట్ ఇదే చేసాడు ఉదయం. ట్రైన్ move అయ్యాక పట్టుకుందాం అనుకున్నాడు. కానీ కాలు జారి platform మీద పడ్డాడు. ఇంకా నయం ట్రైన్ కి ప్లాట్ఫారం కి మద్యలో ఉండే గ్యాప్ లో పడలేదు. అప్పటికే ట్రైన్ లో జనం అంత ఓహ్ ఓహ్ అని కేకలు. ఇది జరిగి 5 క్షణాలు కూడా కాలేదు అప్పుడే మల్లి ఓహ్ ఓహ్ అని శబ్దాలు.. ఏంటి అని బయటకు చుస్తే ఒక స్టూడెంట్ hang చేస్తున్నావాడు హటాత్తుగా move అవుతున్న ట్రైన్ లో నుంచి పడ్డాడు. పక్కన ఉన్న వారిఫై అంతా రక్తం. పడ్డవాడుట్రైన్ డోర్ దగ్గర ఉన్న pole ని పట్టుకొని వంగి platform పైన పడ్డ తన ఫ్రెండ్ ని చూడడానికి ప్రయత్నించాడు కానీ అంతలోనే పక్కనే ఉన్న electricity pole అతని తలకు తగిలి అలానే పడిపోయాడు.

Please హాంగ్ చేయకండి...
చావుని గెలకకండి....
మీ ఫై ఆధారపడి చాలా మంది ఉంటారు..

నేను పైన రాసింది dupe కాదండి..... నిజం

Tuesday, December 22, 2009

మొత్తానికి బ్లాగ్ create ఐంది. ఈ పదాలను తెలుగులో కంటే ఇంగ్లీష్ లోనే రాస్తే బాగుండు అనిపించింది కానీ చాటింగ్ చేస్తూ చేస్తూ తెలుగు పదాలను ఇంగ్లీష్ లో రాయడం అలవాటు అయింది. రాయడం ఒక్కటే కాదు చదవడం కూడా ఇంగ్లీష్ తెలుగుని కలిపి చదవడం మొదలుపెట్టింది మైండ్. ఎలా అంటే ఒకరు orkut లో ఈ status message పెట్టుకున్నారు "My heart is for sale ". దీన్ని చదువుతున్నప్పుడు My heart is for వరకు correct గానే చదివింది mind కానీ లాస్ట్ వర్డ్ వచినప్పుడు సాలె అని చదువుతుంది మైండ్. హర హర అనుకోవాల్సి వచ్చింది. ఎవరో కరెక్ట్ గానే చెప్పారు చదువస్తే ఉన్న మతి పోతుంది అని.

ఇది పోతే, ఏది పోతే అనకండి. ఈ బ్లాగ్ నా అభిప్రాయాలూ రాసుకోవడానికి create చేసుకున్నాను. కొందరు నాలా ఆలోచించవచ్చు. కొందరు వ్యతిరేకించనూవచ్చు. ఎవరి ఇష్టం వారిది. ఉంటాను మరి..